Telangana : నేడు హైదరాబాద్ కు మీనాక్షి నటరాజన్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు నియోజకవర్గాల నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మీనాక్షి నటరాజన్ సమీక్ష చేయనున్నారు. నేడు చేవెళ్ల, నిజామాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలపై మీనాక్షి నటరాజన్ సమీక్ష జరుపుతారు.
పార్లమెంటు నియోజకవర్గాలకు...
ఈ పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీబలోపేతంపై మీనాక్షి నటరాజన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించి వాటిని ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.