Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
telangana chief minister revanth reddy will leave for delhi tomorrow.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై చర్చ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై పార్టీ పెద్దలు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇండియా కూటమి ఈసారి అధికారం రావాలని భావిస్తున్న నేపథ్యంలో పొత్తులు, ఎత్తుల విషయంపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది.
ఇండియా కూటమి....
వివిధ రాష్ట్రాల నేతల నుంచి పొత్తులపై అభిప్రాయాలను సేకరించనుంది. కాంగ్రెస్ కు బలమున్న రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమిలో ఉన్న కొన్ని పార్టీలకు పొత్తులో భాగంగా స్థానాలను కేటాయించడంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో పార్టీ పెద్దల నుంచి రేవంత్ రెడ్డి క్లారిటీ తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆరు గ్యారంటీల అమలు విషయంలో తమ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కూడా రేవంత్ వివరించనున్నారు.