Revanth Reddy : రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి పలు జిల్లాల్లో పర్యటించనున్నారు.

Update: 2025-09-02 04:33 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు మహబూబ్నగనర్ జిల్లా దేవరకద్రలో ఓ ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం భద్రాద్రి జిల్లా బెండాలపాడులో ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎల్లుండి కామారెడ్డి జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తారని సమాచారం.

కోడ్ వచ్చేలోపు...
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించడంతో ఎప్పుడైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కోడ్ వచ్చేలోపు వీలును బట్టి దాదాపు అన్ని జిల్లాల్లోనూ పర్యటించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.


Tags:    

Similar News