Revanth Reddy : వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి

వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆన పరిశీలించారు

Update: 2025-08-28 11:42 GMT

వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆన పరిశీలించారు. స్ట్రాటజిక్ లోకేషన తో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి అని, కూలీపోయిన ప్రాజెక్టుకు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిపుణులు సూచించిన ప్రకారమే ప్రాజెక్టును నిర్మించినందున ఎల్లంపల్లి దశాబ్దాలుగా నిలబడి ఉందని తెలిపారు. మేడిగడ్డ పనికిరాకుండా పోయిందని ఆయన అభిప్రాపడ్డారు.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు...
సుందిళ్లలో నీరు నిల్వ చేయవచ్చు కదా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ మామ, అల్లుడు, ఒకరు స్వాతి ముత్యం, మరొకరు ఆణిముత్యం అనుకుంటారని, మేడారం, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యం తో నిర్మించారని అన్నారు. మూడు బ్యారేజీల నిర్మాణంతో పాటు డిజైన్ లోనూ, నిర్వహణలోనూ లోపం ఉందని ఆయన తెలిపారు. మేడిగడ్డ విషయంలో సాంకేతిక నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని, ముందుకు వెళతామని రేవంత్ రెడ్డి తెలిపారు.


Tags:    

Similar News