Telangana : ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు

Update: 2025-09-07 13:14 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మద్దతిచ్చిన పది మంది ఎమ్మెల్యేలలో తొమ్మిది మంది మాత్రమే హాజరయ్యారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన వ్యక్తిగత కారణాలతో సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది.

స్పీకర్ నోటీసులతో...
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మూడు నెలల్లోగా స్పీకర్ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరడంతో స్పీకర్ కొందరికి నోటీసులు జారీ చేశారు. దీనిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో స్పీకర్ నోటిసులకు కొందరు సమాధానమిచ్చారు. మరికొందరు ఇవ్వాల్సి ఉంది. భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించనున్నారు.


Tags:    

Similar News