Revanth Reddy : నేలకు ముక్కుకు రాస్తావా? కేసీఆర్ కు రేవంత్ ఛాలెంజ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

Update: 2024-05-04 07:58 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. రైతు భరోసా కింద ఇప్పటికే 65 లక్షల మందికి నిధులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. మిగిలిన రైతులకు ఈ నెల 8వ తేదీలోపు జమ చేస్తామని తెలిపారు. ఆసరా పింఛన్ లు కూడా ఈ నెల 9వతేదీ లోపు అందరి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవాలని అనేక కుట్రలు జరుగుతున్నాయని, వాటిని తిప్పి కొట్టాలని రేవంత్ పిలుపు నిచ్చారు.

ఈ నెల 9వ తేదీ లోపు...
ఈనెల 9వ తేదీలోపు ఒక్క రైతు ఖాతాలోనైనా రైతు భరోసా నిధులు జమ కాకుంటే అమరవీరుల స్థూపం వద్ద నేలకు ముక్కుకు రాసి క్షమాపణులు చెబుతావా? అని కేసీఆర్ ఛాలెంజ్ విసిరారు. ఆగస్టు పదిహేనో తేదీలోగా రైతుల రుణాలను మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి మరోసారి తెలిపారు. కేసీఆర్ అసత్యపు ప్రచారాలు చేస్తూ ఈ ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నాయన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీం అని, తెలంగాణ టీంకు రాహుల్ నాయకత్వం వహిస్తారని, గుజరాత్ టీంను ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News