Telangana : ప్రారంభమైన తెలంగాణ మంత్రివర్గ సమావేశం
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీ హాలులో మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలలో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ఇచ్చిన నివేదికపై చర్చించాల్సి ఉన్నందున అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజులను కూడా ఖరారు చేయనున్నారు.
కీలక అంశాలపై...
కాళేశ్వరంపై మంత్రులకు పూర్తి స్థాయి అవగాహన ఈ సమావేశంలో కల్పించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిపితే బాగుంటుందన్న దానిపై మంత్రుల అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి తెలుసుకోనున్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ లో యూరియా కొరతపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై వేల మెట్రిక్ టన్నులు వచ్చిన వెంటనే ఏ ప్రాతిపదికన పంపిణీ చేయాలన్న దానిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయంతో పాటు పలు కీలక అంశాలకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపే అవకాశముంది.