Telangana : ముగిసిన మంత్రి వర్గ విస్తరణ

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ముగ్గురికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది.

Update: 2025-06-08 06:50 GMT

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ముగ్గురికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ముగ్గురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇద్దరు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారికి, ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

మూడు సామాజికవర్గాలకు చెందిన...
వీరిలో గడ్డం వివేక్ మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా, అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సామాజికవర్గానికి చెందిన వారు. ఇక వెనకబడిన తరగతులకు చెందిన అడ్లూరి లక్ష్మణ్ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కొత్త మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. గడ్డం వివేక్ ఇంగ్లీష్ లోనూ, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.


Tags:    

Similar News