Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌పై తెలంగాణ బీజేపీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Update: 2025-09-08 06:41 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌పై బీజేపీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై దాఖలైన నిందారోపణ కేసును రద్దు చేసిన హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఈ పిటిషన్ వేసింది. చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయ్, న్యాయమూర్తులు కె. వినోద్ చంద్రన్, అతుల్ ఎస్. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

తీవ్ర వ్యాఖ్యలు...
“రాజకీయ పోరాటాలకు ఈ కోర్టును వాడుకోవద్దని మేము మళ్లీ మళ్లీ చెబుతున్నాం. డిస్మిస్. రాజకీయ నాయకుడు అయితే చర్మం మందంగా ఉండాలి,” అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఆగస్టు 1న హైదరాబాద్ ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు రద్దు చేయాలంటూ రేవంత్ రెడ్డి వాదనపై తెలంగాణ హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో బీజేపీ తెలంగాణ పార్టీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మే 2024లో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డికి బీజేపీపై అవమానకరంగా, రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపించారు.


Tags:    

Similar News