మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మూడు వాహనాలు ఢీకొని

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

Update: 2026-02-13 03:36 GMT

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ జిల్లా జీనమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్‌పూర్ చౌరస్తా వద్ద శుక్రవారం ఉదయం క్రేన్, టాటా ఏస్, బొలెరో వాహనాలు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వారిని...
గాయపడిన వారికి స్థానికులు, పోలీసులు సహాయంతో సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణమని చెబుతున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా తేల్చారు. అయితే గాయపడిన వారు ప్రస్తుతం కోలుకుంటున్నారని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News