Revanth Reddy : రాహుల్ కు తనకు మధ్య గ్యాప్ పై రేవంత్ ఏమన్నారంటే?

తనకు, రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారంపై రేవంత్ రెడ్డి స్పందించారు.

Update: 2025-02-07 12:35 GMT

తనకు, రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారంపై రేవంత్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీకి, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ తాను ఎప్పికప్పడు రాహుల్ తో ఫోన్ లో మాట్లాడి రాష్ట్ర విషయాలు వివరిస్తున్నానని తెలిపారు. అది బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం మాత్రమేనని అన్న రేవంత్ తాము నిర్వహించని కులగణనపై పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రస్తావించడాన్నికూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ను తాము కోరలేదని కూడా ఆయన తెలిపారు.

మంత్రి వర్గ విస్తరణపై...
ప్రచారంపై తాము ఫోకస్ చేయడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపైనే దృష్టి సారించామని రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణన సర్వేను పక్కాగా చేశామన్న రేవంత్ రెడ్డి త్వరలో దీనిపై చట్టం కూడా తెస్తామని తెలిపారు. సర్వేలో ఐదు శాతం బీసీలు పెరిగారని ఆయన తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై ఇంకాచర్చలు జరుగుతున్నాయన్న రేవంత్ అధినాయకత్వం ఎవరి పేరును నిర్ణయిస్తే వారే మంత్రులవుతారని అన్నారు. ఎమ్మెల్యేలు నలుగురు కూర్చుని మాట్లాడుకున్నంత మాత్రాన దానిని అసంతృప్తి అని ఎలా అంటారని ప్రశ్నించారు. . అర్జంటుగా అరెస్ట్ చేయించి జైల్లో వేయించాలన్న ఆలోచన తనకు లేదన్న ఆయన మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని అన్నారు.


Tags:    

Similar News