Telangana : రాహుల్ ను కలిసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.

Update: 2025-11-15 12:47 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఆయన వెంట జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కలిసింది.

స్థానిక సంస్థల ఎన్నికలపై...
అనంతరం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కూడా వీరు భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి బృందం చర్చించినట్లు సమాచారం. జూబ్లీహీల్స్ ఉప ఎన్నిక గెలుపు ఊపుతోనే స్థానిక సంస్థలకు వెళతామని, ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి నిధులు రావడం లేదని పార్టీ నాయకత్వానికి చెప్పినట్లు సమాచారం. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ముఖ్యమంత్రి బృందం పార్టీ నాయకత్వాన్ని కోరినట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.


Tags:    

Similar News