మోదీ ఆ హేళన నీకు తగదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు బాధించాయని రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు అన్నారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు బాధించాయని రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు అన్నారు. పదేళ్ల ఉద్యమం తర్వాతనే తెలంగాణ రాష్ట్రం సాధించిందని చెప్పారు. పద్ధతి ప్రకారమే తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిందని కె.కేశవరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కించపర్చే విధంగా మోదీ మాట్లాడటం తగదని సూచించారు. ఢిల్లీలో ఆయన పార్లమెంటు సభ్యులతో కలసి మీడియాతో మాట్లాడారు.
ఎన్నో బలిదానాలు....
తెలంగాణ రాష్ట్రం ఊరికే ఏర్పాటు కాలేదన్నారు. ఎన్నో బలిదానాల కారణంగా ఏర్పడిందని కె.కేశవరావు గుర్తు చేశారు. ఇవన్నీ విస్మరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును హేళనగా మాట్లాడటం తగదని సూచించారు. దీనిపై తమ నిరసన వ్యక్తం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రధాని అసందర్భంగా మాట్లాడి తప్పు చేశారని అభిప్రాయపడ్డారు.