రాత్రికి భారీ వర్షాలు పడే అవకాశం.. హెచ్చరించిన అధికారులు

తెలంగాణలో శుక్ర, శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం

Update: 2023-08-18 14:01 GMT

తెలంగాణలో శుక్ర, శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలలో కొనసాగుతూ ఉంది. అల్పపీడనం పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ రాగల రెండు నుండి మూడు రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర చత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని.. ఈ రోజు దిగువస్థాయిలోని గాలులు, పశ్చిమ, వాయవ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెంలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. శనివారం ఆదిలాబాద్, కుమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది. ఈ రెండు రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్‌ ఆయా జిల్లాల కలెక్టర్‌లను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి, మానిటర్‌ చేస్తూ ఉండాలని ఆదేశించారు.


Tags:    

Similar News