కేసీఆర్ కు మోదీ లేఖ

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు

Update: 2025-02-04 07:03 GMT

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి మరణించడంపై ఆయన సంతాపాన్ని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. ఇటీవల కేసీఆర్ సోదరి సకలమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఐదో సోదరి. ప్రతి రాఖీపండగ నాడు ఆమె తన చేతికి రాఖీ కట్టేదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

సంతాపం ప్రకటించిన...
అయితే దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని లేఖ ద్వారా తెలియజేశారు. సోదరి మరణానికి చింతిస్తున్నట్లు తెలిపారు. ఆమెకుటుంబానికి, మీకు సానుభూతి తెలుపుతున్నానని మోదీ కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ బాధ నుంచి త్వరగా కోలుకుని ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మోదీ ఈ లేఖలో ఆకాంక్షించారు.


Tags:    

Similar News