BRS : వరంగల్ సభకు పోలీసుల అనుమతి

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు

Update: 2025-04-13 02:43 GMT

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. ఈ నెల 27వ తేదీన వరంగల్ లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలకు అనుమతివ్వాలని కోరగా ముందు పోలీసులు సభకు అనుమతించ లేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు తమకు అనుమతిని మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

కేసు కోర్టులో ఉండగానే ...
కేసు కోర్టులో ఉండగానే సభకు పోలీసులు అనుమతిచ్చి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈనెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుగుతుంది. పోలీసుల అనుమతితో కోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ నాయకులు విత్ డ్రా చేసుకున్నారు. ఈ సభకు దాదాపు ఐదు లక్షలకు మందికిపైగా కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News