తెలంగాణకు ప్రత్యేక జెండాను రూపొందిస్తాం

సెప్టంబరు 17ను టీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు

Update: 2022-09-12 13:07 GMT

సెప్టంబరు 17వ తేదీని టీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీలు వాట్సప్ యూనివర్టిటీలో అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రెండు మతాల మధ్య కొట్లాట పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడ లేదన్నారు. చరిత్రను వక్రీకరించి ప్రచారం చేసుకుంటున్న టీఆర్ఎస్, బీజేపీలకు ఈ కార్యక్రమాలను నిర్వహించే నైతిక హక్కు, అర్హత లేదన్నారు. సెప్టంబరు 17 2022 నుంచి సెప్టంబరు 17 2023 వరకూ వజ్రోత్సవాలు నిర్వహించాలని పీసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

తెలంగాణలో వాహనాలపై...
ఇక ముందు తెలంగాణలో వాహనాలపై టీఎస్ కాకుండా టీజీ గా మార్చాలని నిర్ణయించామని తెలిపారు. అందెశ్రీ అందించిన పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని, అధికారంలోకి రాగానే ఆ పని చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లిని తిరస్కరిస్తూ సబ్బండ వర్గాలకు అనుగుణంగా మార్పులు చేసి కాంగ్రెస్ తెలంగాణ తల్లిని రూపొందించబోతున్నామని, సెప్టంబరు 17 నుంచి ఈ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రత్యేక జెండాను రూపొందించబోతున్నామని రేవంత్ తెలిపారు. తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. మునుగోడు నియోజకవర్గంలో రేపు ఇన్‌ఛార్జులతో రేపు మాణికం ఠాగూర్ సమావేశమవుతారని ఆయన తెలిపారు.


Tags:    

Similar News