Revanth Reddy : నేడు రేవంత్ కీలక భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ ఛీఫ్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ ఛీఫ్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. నిన్న రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో భేటీ అయిన బీసీ నేతలు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు 8 తేదీన ఇవ్వనున్న తీర్పుపై చర్చించారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
బీసీ గర్జన సభపై...
భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ ఛీఫ్, మంత్రులు,ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. దసరా తర్వాత బీసీ గర్జన కు తెలంగాణ కాంగ్రెస్ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే బీసీ గర్జన సభను నిర్వహించాల్సి ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో సభ వాయిదా పడింది. కామారెడ్డిలో ఈ సభను నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. ఇప్పుడు ఈరోజు జరిగే సమావేశంలో బీసీ గర్జన సభ తేదీలను, స్థలాన్ని నిర్ణయించే అవకాశముంది.