Telangana : తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మార్పు
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జిని మారుస్తూ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. మీనాక్షి నటరాజన్ ను నియమించారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జిని మారుస్తూ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జిగా దీపాదాస్ మున్షీ ఉన్నారు. ఆమెపై గత కొంతకాలంగా నేతలు అసంతృప్తితో ఉన్నారు. అధినాయకత్వం కూడా దీపాదాస్ మున్షీని మార్చాలని ఎప్పటి నుంచో భావిస్తున్నట్లు ప్రచారం ఉంది.
దీపాదాస్ మున్షీని తప్పించి...
అయితే దీపాదాస్ మున్షీని తప్పించి ఆమె స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ను నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాహుల్ గాంధీ టీంలో కీలకంగా ఉన్న మీనాక్షి నటరాజన్ ను నియమించడంతో పార్టీ నియామకాలు, మంత్రివర్గ విస్తరణ వంటి వాటిపై ప్రభావం పడే అవకాశముంది.