Telangana : నేడు మద్యం దుకాణాలు బంద్
తెలంగాణలో నేడు పలుచోట్ల మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి
తెలంగాణలో నేడు పలుచోట్ల మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ క్రమంలో వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు మున్సిపాలిటీల్లో కూడా రేపు షాపులు బంద్ కానున్నాయి. తెలంగాణలో నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జగనుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరగ్గా.. శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఫిబ్రవరి 13వ తేదీన ఎన్నికల కౌంటింగ్ క్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం కౌంటింగ్ జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి.
కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో...
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఇంద్రేశం, ఇస్నాపూర్, గడ్డపోతారం మునిసిపాలిటీలతో పాటు కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని ఎల్లంపేట, అలియాబాద్, ముడిచింతలపల్లి పరిధిలో కూడా మద్యం షాపులు మూసివేయనున్నారు. వైన్ షాపులతో పాటు బార్లు, రెస్టారెంట్లలో మద్యం సరఫరా నిలిపివేయనున్నారు. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్డారం, చిట్కుల్, ఇస్నాపూర్, రుద్రారంతో పాటు గడ్డపోతరం మున్సిపాలిటీలోని గడ్డపోతరం, ఖాజీపల్లి, మాధార, ముడిచింతలపల్లి మునిసిపాలిటీలో మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగే అన్ని ప్రాంతాల్లో మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.