మరువేషంలో పోలీసులు.. దళారులు ఎలా దొరికారంటే?

బ్యాంకుల్లో పంటరుణాలు ఇప్పించేందుకు కమీషన్‌ వసూలు చేస్తున్న దళారులను ఆదిలాబాద్‌ జిల్లా పోలీసులు ఎంతో తెలివిగా పెట్టేసుకున్నారు.

Update: 2025-06-06 11:42 GMT

బ్యాంకుల్లో పంటరుణాలు ఇప్పించేందుకు కమీషన్‌ వసూలు చేస్తున్న దళారులను ఆదిలాబాద్‌ జిల్లా పోలీసులు ఎంతో తెలివిగా పెట్టేసుకున్నారు. కమీషన్‌ దందాపై ఫిర్యాదులు రావటంతో జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదేశాల మేరకు పలు బ్యాంకుల వద్దకు పోలీస్‌ అధికారులే రైతుల వేషంలో వెళ్లారు. రుణాల కోసం వచ్చిన రైతులు అనుకుని మాట కలిపిన దళారులు ఎలా చేస్తాం, ఏమేమి చేస్తామని పూస గుచ్చినట్లు చెప్పేసారు.


రైతులు తీసుకున్న రుణాలను వారే వడ్డీతో సహా బ్యాంకులో చెల్లించి, తిరిగి రైతులకు అధిక రుణం వచ్చేలా చేస్తున్నారు. ఆ వచ్చే రుణం నుంచి తాము కట్టిన రుణం మొత్తంతో పాటు అదనంగా 5 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకు కమీషన్‌ తీసుకుంటున్నారు. గుడిహత్నూర్, ఉట్నూర్, నార్నూర్, బేల, భీంపూర్, మావల, ఇంద్రవెల్లి మండలాల్లో 34 మంది దళారులు పట్టుబడ్డారు.

Tags:    

Similar News