Telangana : తెలంగాణ అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు

తెలంగాణ అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించిన చర్చ జరుగుతుండటంతో సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి.

Update: 2025-08-31 02:48 GMT

తెలంగాణ అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించిన చర్చ జరుగుతుండటంతో సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. అధికార, విపక్షాల సభ్యులు ఇప్పటికే ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు అసెంబ్లీలో ప్రవేశపెడుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మూడు కీలక బిల్లులు...
బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ తో పాటు మూడు కీలక బిల్లులను నేడు తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టనుంది. మున్సిపల్ శాఖలో చట్ట సవరణకు సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టనుంది. మూడు బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. అందుకోసం సభ బయట ఎలాంటి ఆందోళనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకుంది.


Tags:    

Similar News