రెయిన్ అలర్ట్ : ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2022-09-09 04:16 GMT

తెలంగాణలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతం వరకూ ఈ ద్రోణి కొనసాగుతుందని చెప్పారు. ఈ ప్రభావంతో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.

ఏపీలోనూ....
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విజయనగరం, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం మాత్రం కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News