పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

మన దేశంలో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.

Update: 2021-11-25 01:56 GMT

బంగారం ఎప్పుడు కొని దాచుకున్నా అది పెట్టుబడి కింద పరిగణిస్తారు. భూముల తరహాలోనే బంగారాన్ని కూడా కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకే మన దేశంలో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ను బట్టి బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కరోనా సమయంలో బంగారం ధరలు మరింత ప్రియమయ్యాయి. ప్రస్తుతం బంగారం ధర కొంచెం తగ్గుతూ వస్తుంది.

బంగారం ధరలు ఇలా....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,630 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,630లుగా ఉంది. గ్రాముకు ఈరోజు కేవలం 36 రూపాయలు మాత్రమే పెరిగింది. వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి.


Tags:    

Similar News