పుత్తిడి ప్రియులకు షాక్

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. నిన్నటి వరకూ స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఈరోజు పెరగడం వినియోగదారులకు ఇబ్బందిగా మారింది

Update: 2021-11-27 01:40 GMT

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. నిన్నటి వరకూ స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఈరోజు పెరగడం వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం కొనుగోళ్లు ఎక్కువ కావడం కూడా ధరలు పెరగడానికి ఒక కారణం. ధరలు ఎంత పెరిగినా తమ అవసరాలు, సెంటిమెంట్ కోసం బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి.

ఎంత పెరిగిందంటే?
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,850 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల పది గ్రాముల బంగార ధర 48,930 రూపాయలుగా ఉంది. గ్రాముకు 180 నుంచి 310 వరకూ దేశ వ్యాప్తంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి మాత్రం 67,900లుగా ఉంది.


Tags:    

Similar News