చెన్నమనేని రమేష్ కు భారీ షాక్
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు భారీ షాక్ తగిలింది.
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు భారీ షాక్ తగిలింది. ఓటర్ల జాబితా నుంచి అధికారులు ఆయన పేరును తొలగించారు. చెన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని, భారత పౌరసత్వం లేదని న్యాయస్థానాలు తీర్పు చెప్పడంతో పాటు ప్రత్యర్ధి ఆది శ్రీనివాస్ కు న్యాయస్థానం ఖర్చుల కింద నగదు చెల్లించాలని కూడా చెప్పింది.
జర్మనీ పౌరసత్వం ఉండటంతో...
చెన్నమనేని రమేష్ బాబు రెండు సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వేములవాడ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆయన పౌరసత్వంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఆయన పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.దీంతో ఇక ఆయన భారత్ లో ఎక్కడా పోటీ చేసే అవకాశం లేదు.