Telagngana : బాసరకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. వరద నీరు అక్కడ?

బాసరలో వరద నీరు పెరుగుతుంది. ఆరు గంటల వ్యవధిలో ఐదు అడుగుల మేరకు వరద నీరు పెరిగింది.

Update: 2025-08-30 04:15 GMT

బాసరలో వరద నీరు పెరుగుతుంది. ఆరు గంటల వ్యవధిలో ఐదు అడుగుల మేరకు వరద నీరు పెరిగింది. ఇప్పటికే అనేక దుకాణాలు కొంత వరకూ నీటమునిగియి. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదల కారణంగా గోదావరికి వరద నీరు మరింత పెరుగుతుంది. దీంతో బాసర ఆలయం సమీపానికి వరద నీరు సమీపించిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

కొన్ని ఇళ్లలోకి...
బాసరలోని కొన్ని ఇళ్లలోకి కూడా నీరు చేరింది. కొన్ని దుకాణాల్లోకి నీరు చేరడంతో భారీగా నష్టం వాటిల్లినట్లు దుకాణాల యజమానులు చెబుతున్నారు. గోదావరి వరద మరింత పెరిగే అవకాశముండటంతో స్థానికులు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. బాసరకు వచ్చే భక్తులు కూడా ఇబ్బందులు పడే అవకాశముందని, అందుకే రద్దీ కూడా అంతగా లేదని అంటున్నారు.


Tags:    

Similar News