ఇటు ఫ్లెక్సీల వార్.. అటు పైలాన్ ఆవిష్కరణ

జనగామ ప్రాంతంలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తుంది. బండి సంజయ్ పాదయాత్ర జనగామకు చేరుకుంది

Update: 2022-08-17 08:09 GMT

జనగామ ప్రాంతంలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర జనగామకు చేరుకుంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు పెద్దయెత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బండి సంజయ్ కు స్వాగతం చెబుతూ బీజేపీ శ్రేణులు హోర్డింగ్ లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు కొందరు చించివేయడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఇరు పార్టీల ఫ్లెక్సీలు....
మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేరిట కొన్ని ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు వెలిశాయి. నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నిధులను తెలంగాణకు తీసుకు వచ్చిన తర్వాతనే పాదయాత్ర చేయాలని బండి సంజయ్ ను కోరుతూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. దీనికి బదులుగా నియోజకవర్గానికి నిధులు ఏం తెచ్చావంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుతో జనగామ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ప్రధాన కూడళ్లలో భారీగా మొహరించారు.
వెయ్యి కిలోమీటర్లు....
బండి సంజయ్ పాదయాత్ర నేటికి వెయ్యి కిలోమీటర్లకు చేరుకుంటుంది. పాలకుర్తి లోని అక్కిరెడ్డి పల్లె వద్ద పైలాన్ ను ఏర్పాటు చేశారు. 82 రోజుల పాటు 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ పాదయాత్ర కొనసాగుతుంది. వెయ్యి బెల్లూన్లను ఈ సందర్భంగా ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య కార్యకర్తలు అందరూ పాలకుర్తికి చేరుకుంటున్నారు.


Tags:    

Similar News