సీఎం సహాయ నిధికి యువ రైతు విరాళం

కాళేశ్వరం జలాలతో పంటలు పండటంతో తద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ఒక యువరైతు ముఖ్యమంత్రికి విరాళాన్ని ప్రకటించారు.

Update: 2022-01-29 03:59 GMT

కాళేశ్వరం జలాలతో పంటలు పండటంతో తద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ఒక యువరైతు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాన్ని ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి సీఎం సహాయనిధికి పదివేల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ప్రగతిభవన్ కు వచ్చి సీఎం కేసీఆర్ కు చెక్కును అందజేశారు.

కాళేశ్వరం నీటితో....
గతంలతో తమ భూములు బీడుగా ఉండేవని, కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత నీరు చేరి తమ భూములు సస్యశ్యామలంగా మారాయని శ్రీనివాసరెడ్డి చెప్పారు. తన భూమిలో తొలి పంట ద్వారా వచ్చిన ఆదాయంలో పది వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రెండో పంటలో వచ్చిన ఆదాయంలో కూడా కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేస్తానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. యువరైతు శ్రీనివాసరెడ్డిని ఈ సందర్భంగా కేసీఆర్ అభినందించారు. సామాజిక బాధ్యత యువత గుర్తెరగాలని కోరారు.


Tags:    

Similar News