నేడు హైదరాబాద్ కు మీనాక్షి..కొండా కుటుంబంపై ఫిర్యాదు

హైదరాబాద్ కు నేడు కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ రానున్నారు

Update: 2025-06-22 02:51 GMT

హైదరాబాద్ కు నేడు కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ రానున్నారు. గాంధీభవన్ లో పంచాయతీ రాజ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమెపాల్గొననున్నారు. మీనాక్షి నటరాజన్ మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా నేతలతో మీనాక్షి నటరాజన్ ను చర్చించనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై...
దీంతో పాటు అనేక విషయాలను నేతలతో కూడా మాట్లాడనున్నారు. ప్రధానంగా వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్ నేడు కలసిమంత్రి కొండా సురేఖ, కొండా మురళిపై ఫిర్యాదు చేయనున్నారు. వారు చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్ లతో పాటు వీడియోలను కూడా అందించనున్నారు. మరొక వైపు జూబ్లీహిల్స్ నేతలతో కూడా మీనాక్షి నటరాజన్ ఈ మూడు రోజుల సమావేశంలో భేటీ అయ్యే అవకాశముంది.


Tags:    

Similar News