Weather Report : చలి నుంచి వేడి వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యంతో అలెర్ట్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చలి తీవ్రత కొంత మేర కొనసాగుతుంది.

Update: 2026-01-23 04:15 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చలి తీవ్రత కొంత మేర కొనసాగుతుంది. విద్యుత్తు వినియోగం కూడా పూర్తి స్థాయిలో పెరగలేదు. అయితే రాత్రి, తెల్లవారు జామునమాత్రమే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ కొంత ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే రకమైన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం పది గంటల వరకూ పొగమంచు మాత్రం వీడటం లేదు. మరికొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

రాష్ట్రమంతటా ఉక్కపోత...
ఆంధ్రప్రదేశ్ లో చలిగాలుల తీవ్రత తగ్గి ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు రాష్ట్రమంతటా ఇరవై ఐదు నుంచి ముప్ఫయి డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. క్రమంగా ఈ నెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తు్న్నారు. ఏజెన్సీ ప్రాంతంలో తప్ప మిగిలిన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఫిబ్రవరి మొదటి వారానికి మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వేడి పెరుగుతున్నందున...
తెలంగాణలోనూ చలి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టిందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర మొత్తం నేడు పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ వంటి జిల్లాల్లో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన ప్రాంతంలో మాత్రం గరిష్టంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పగటి పూట ఉష్ణోగ్రతలు డబుల్ డిజిట్ కు చేరాయి. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వణికే చలి నుంచి ఒక్కసారిగా వేడి పెరిగినందువల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.


Tags:    

Similar News