Revanth Reddy : ఏపీ సర్కార్ కు రేవంత్ హెచ్చరిక.. చుక్క నీరు కూడా వదులుకోం

తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ విలీన దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు

Update: 2025-09-17 05:03 GMT

తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ విలీన దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. ఎన్నో రంగాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా రాష్ట్రంలో ముందుకు తీసుకెళుతుందని తెలిపారు. మహిళలకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

కృష్ణాజలాలకు రావాల్సిన...
గత పాలకులను సరిదిద్దుతూ ఏ విషయంలోనూ రాజీపడే ప్రసక్తి లేదనిప్రకటించారు. కృష్ణా జలాల్లో చుక్కనీటిని కూడా వదులుకోమని తెలిపారు. నికరజాలాల్లో 904 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉండగా, వాటిని సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కోసం తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఎస్ఎల్.బి.సి టన్నెల్ ను పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. టన్నెల్ లో ప్రమాదం జరిగి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం ఇచ్చామని చెప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎన్ని అవాకులుచెవాకులు పేలినా తమ ప్రయత్నాన్ని మానుకోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం బ్రాండ్ ను తాము పరిరక్షిస్తూ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తామని చెప్పారు.




Tags:    

Similar News