కిషన్ రెడ్డిపై రేవంత్ హార్ష్ కామెంట్స్
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పడ్డారు. కిషన్‌రెడ్డి కేటీఆర్‌కి లైజనింగ్ ఆఫీసర్ అని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఆర్గాన్ డొనేషన్ చేసింది కాబట్టే..ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది పార్లమెంటు స్థానాలను గెలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని చెప్పడానికి పార్లమెంటు ఎన్నికల ఫలితాలే నిదరశనమని రేవంత్ రెడ్డి తెలిపారు.
కేటీఆర్ కు ప్రయివేటు ట్యూషన్ మాస్టార్...
లేకుంటే బీజేపీకి అన్ని ఎంపీ స్థానాలు గెలిచే పరిస్థితి లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్‌రెడ్డికి కేటీఆర్ ప్రైవేట్ ట్యూషన్ మాస్టర్ అని అన్నారు. బీఆర్ఎస్ కోసమే కిషన్‌రెడ్డి పనిచేస్తున్నారని, మకూ కోసం పనిచేసినందుకే మెదక్‌లో బీఆర్ఎస్ లో తనకు తానుగా ఓటమి పాలయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయం అందరికీ తెలుసునని అన్నారు.