Revanth Reddy : చంద్రబాబూ గ్యాప్ పెంచుకోవద్దు.. రేవంత్ సూచన

చంద్రబాబు నాయుడు బనకచర్ల విషయంలో పునరాలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

Update: 2025-06-18 14:46 GMT

చంద్రబాబు నాయుడు బనకచర్ల విషయంలో పునరాలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. లేకపోతే అనవసరంగా గ్యాప్ లు పెరుగుతాయని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము మా వాటా నీటిని వాడుకున్నతర్వాత మాత్రమేమిగులుజలాలను మీరు వాడుకోవాలన్నారు. తమవాటాకింద వచ్చే నీటిని మమ్మల్ని విడుదలచేసుకోనివ్వాలని రేవంత్ రెడ్డికోరారు. పరివాహక ప్రాంతం నీటినివాడుకున్నతర్వాత మాత్రమే దిగువ ప్రాంతాలు నీటిని వాడుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

బనకచర్లను అడ్డుకుంటాం...
తమ ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న రేవంత్ రెడ్డి తాము ఢిల్లీలో పోరాటం చేస్తామని చెపపారు. కేంద్రంలోనూ అందరి నేతలను కలసి తమతో కలసి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరతామని చెప్పారు. తాము రేపు కేంద్రమంత్రినికలిసి తెలంగాణకు ఉన్నఅభ్యంతరాలను తెలియజేస్తామని తెలిపారు. మోదీకి చంద్రబాబు అవసరం, చంద్రబాబుకు మోదీ అవసరం ఉండటంతోనే ఇష్టారాజ్యంగా వేరే రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కిషన్ రెడ్డి కూడా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడం లేదన్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఎంపీల సూచనలు తీసుకున్నామని, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.


Tags:    

Similar News