జీపీఎస్ ట్రాకర్ తో భర్త మీద నిఘా పెట్టి.. చంపించి!!
ప్రియుడిపై మోజుతో భర్త తేజేశ్వర్‌ను చంపించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐశ్వర్య.
ప్రియుడిపై మోజుతో భర్త తేజేశ్వర్‌ను చంపించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐశ్వర్య. భర్త బైకుకు జీపీఎస్ ట్రాకర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ ట్రాకర్ ఆధారంగానే భర్త లొకేషన్ వివరాలను సుపారీ ముఠాకు అందజేసింది. పెళ్లయిన నెల రోజుల వ్యవధిలో ఐదుసార్లు హత్యాయత్నాలు జరగ్గా, తప్పించుకున్న తేజేశ్వర్ ఆరోసారి ప్రాణాలు కోల్పోయాడు. తేజేశ్వర్ చనిపోయాడని నిర్దారణకు వచ్చిన వెంటనే తిరుమలరావు, ఐశ్వర్యలకు సుపారీ గ్యాంగ్ సమాచారం ఇచ్చింది. తేజేశ్వర్ కనపడట్లేదని గద్వాల పట్టణ పోలీసు స్టేషన్లో అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం తేజేశ్వర్ ఇంటికి వెళ్లి పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఐశ్వర్య సరైన సమాచారం చెప్పకపోవడంతో పోలీసులకు అనుమానాలు ఎక్కువయ్యాయి.