రేవంత్ అధ్యక్షతన తెలంగాణ ఎన్నికల కమిటీ ప్రకటించిన ఏఐసీసీ

తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి.

Update: 2023-07-20 11:57 GMT

తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎన్నికల కమిటీని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. ఈ కమిటీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఛైర్మన్‌గా నియమించింది. మొత్తం 26 మందితో కమిటీలో ఉన్నారు. పార్టీలోని సీనియర్ నేతలకు చోటు కల్పించింది. ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ కమిటీని ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సభ్యులు వీరే

చైర్మన్‌ - రేవంత్‌ రెడ్డి, సభ్యులు - భట్టి విక్రమార్క మల్లు, తాటిపత్రి జీవన్‌రెడ్డి, మహేష్‌ కుమార్‌ గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మహ్మద్‌ అజారుద్దీన్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్‌, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, చల్లా వంశీ చంద్‌ రెడ్డి, ఎస్‌.ఏ సంపత్‌ కుమార్‌, రేణుకా చౌదరీ, పోరికా బలరాం నాయక్‌, పొడెం వీరయ్య, సీతక్క, మహ్మద్‌ అలీ షబ్బీర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌ రావు, ఎం.సునీతారావు ఉన్నారు.

ఎక్స్ ఆఫీషియో సభ్యులు: ఈ ఎన్నికల కమిటీలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎన్ఎస్ యూ ఐ అధ్యక్షుడు, సేవాదళ్ చీఫ్ అర్గైనైజర్స్ కు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా అవకాశం కల్పించారు. 

ఇక గత శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీని ఏఐసీసీ నియమించింది. ప్రచార కమిటీ చైర్మన్‌గా మధు యాష్కీని నియమించగా, ప్రచార కమిటీ కో చైర్మన్‌గా పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఎంపిక చేసింది. ప్రచార కమిటీ కన్వీనర్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్‌ను నియమించగా, 37 మంది సభ్యులతో కమిటీని నియమించినట్లు ఏఐసీసీ పేర్కొంది. కాంగ్రెస్ రాష్ట్రంలో పునరాగమనం చేయాలని చూస్తోంది. జూలై 2 న ఖమ్మం నుండి తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అక్కడ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

Tags:    

Similar News