హిట్ మ్యాన్ కు ఏమైంది?

టీం ఇండియా కెప్టెన్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత రోహిత్ శర్మకు వరస విజయాలు లభించాయి

Update: 2022-04-07 02:24 GMT

టీం ఇండియా కెప్టెన్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత రోహిత్ శర్మకు వరస విజయాలు లభించాయి. ఇది ఆయనకు, ఆయన అభిమానులకు ఎంతో ఆనందం కలిగించాయి. కానీ ఐపీఎల్ 2002 సీజన్ రోహిత్ శర్మకు అచ్చిరాలేదనే చెప్పాలి. ఐపీఎల్ లో మంచి కెప్టెన్ గా రోహిత్ శర్మకు మంచి పేరుంది. ముంబయి ఇండియన్స్ ను అనేకసార్లు ఛాంపియన్స్ గా నిలిపాడు. ఇక రోహిత్ శర్మ క్రీజులో ఉంటే కనీసం యాభై పరుగుల గ్యారంటీ ఉండేది.

చెత్త ఆటతో...
కానీ అది ఒకప్పుడు. ఈ సీజన్ లో రోహిత్ శర్మ చెత్త ఆటను ఆడుతున్నాడు. ఆయన అభిమానులు కూడా దానిని తట్టుకోలేక పోతున్నారు. ఇప్పటి వరకూ ముంబయి ఇండియన్స్ ఈ సీజన్ లో మూడు మ్యాచ్ లు ఆడింది. మూడు మ్యాచ్ లోనూ పరాజయాన్ని చవి చూసింది. పోనీ రోహిత్ వ్యక్తిగతంగా రాణించాడా? అంటే అదీ లేదు. మూడు మ్యాచ్ లలోనూ రోహిత్ శర్మ తక్కువ పరుగులకే అవుటయ్యాడు.
వరస ఓటములతో.....
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 41 పరుగులు, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పది పరుగులు, కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో మూడు పరుగులు మాత్రమే చేసి ఔటవ్వడం విశేషం. ఈ సీజన్ లో రోహిత్ శర్మ వ్యక్తిగతంగా తాను, కెప్టెన్ గా టీంను సమర్థవంతంగా నడిపించలేకపోతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వీటికి సమాధానం త్వరలోనే చెబుతాడని ఆయన అభిమానులు అంటున్నారు.


Tags:    

Similar News