సన్‌రైజర్స్ ఘనవిజయం – ఆర్సీబీకి ప్లేఆఫ్స్ టాప్2 షాక్..!
ఆర్సీబీ ప్లేఆఫ్స్ టాప్-2 ఆశలకు సన్‌రైజర్స్ షాక్. లక్నోలో 42 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసుకుంది.
ప్లే ఆఫ్స్ లో టాప్-2లో చేరుకోవాలని భావించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సన్ రైజర్స్ జట్టు ఊహించని షాకిచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నోలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ స్కోరును ఛేదించే ప్రయత్నంలో బెంగళూరు జట్టు ఆఖర్లో పతనమైంది. 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 94 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరుకు ఓపెనర్లు శుభారంభం అందించినా.. ఆర్సీబీ చివరి 7 వికెట్లను 16 పరుగుల తేడాతో చేజార్చుకుంది. ఈ ఓటమితో టాప్-2 లో చేరే అవకాశానికి బెంగళూరు కాస్త దూరమైంది.