దారుణ ఓటమి.. అది కదా ఐపీఎల్ అంటే

పది పరుగుల తేడాతో లక్నో సూపర్ వారియర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలయింది.

Update: 2023-04-20 03:48 GMT

ఐపీఎల్‌లో ఇంత తక్కువ స్కోరును ఛేదించడంలో రాజస్థాన్ రాయల్స్ విఫలమవ్వడం బహుశ ఇదే తొలిసారి కావచ్చు. బౌలర్లకు అనుకూలించే పిచ్ కావడంతో బ్యాటర్లు రాణించలేకపోయారు. ఆరంభంలో అదిరినా చివరకు జట్టు గెలవలేక చేతులెత్తేసింది. పది పరుగుల తేడాతో లక్నో సూపర్ వారియర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలయింది.

తక్కువ పరుగులే...
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు పెద్దగా స్కోరు ఏమీ చేయలేదు. కేవలం 154 పరుగులు చేసింది. అందులో మేయర్స్ ఒక్కడే అర్ధ సెంచరీ చేశాడు. దీంతో రాజస్థాన్ విజయం ఖాయమనుకున్నారంతా. అంతా అనుకున్నట్లు అయితే అది ఐపీఎల్ ఎందుకవుతుంది. ఛేదనకు దిగిన రాయల్స్ జట్టు తొలుత బట్లర్, జైశ్వాల్ ఒక కుమ్ము కుమ్మేశారు. దీంతో విజయం గ్యారంటీ అనుకున్నారు. తర్వాత వరసగా వికెట్లు పడిపోవడంతో చివరి ఐదు ఓవర్లకు 51 పరుగులు చేయాల్సి ఉండగా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా దికిన దేవదత్ వడిక్కల్ కూడా రాణించకపోవడంతో సులువుగా విజయాన్ని లక్నోకు అప్పగించేసింది.


Tags:    

Similar News