భారీ ధరకు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

లివింగ్ స్టోన్ బౌలింగ్ లోనే కాదు.. బ్యాటింగ్ లోనూ తన సత్తా చూపగలడు. తన ఆటతో మొత్తం ఆటనే మలుపు తిప్పగల సమర్థుడు. అందుకే

Update: 2022-02-13 11:39 GMT

బెంగళూరులో రెండోరోజు ఐపీఎల్ వేలం కొనసాగుతోంది. రెండోరోజు వేలంలో.. అత్యధిక ధర పలికాడు ఇంగ్లండ్ కు చెందిన ఆల్ రౌండర్ లివింగ్ స్టోన్. లివింగ్ స్టోన్ కనీస ధర రూ. కోటి నుంచి వేలం మొదలవ్వగా.. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు అతడిని ఏకంగా రూ.11.5 కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసింది. లివింగ్ స్టోన్ బౌలింగ్ లోనే కాదు.. బ్యాటింగ్ లోనూ తన సత్తా చూపగలడు. తన ఆటతో మొత్తం ఆటనే మలుపు తిప్పగల సమర్థుడు. అందుకే అతడిని దక్కించుకునేందుకు పంజాబ్ కింగ్స్ పోటీ పడింది. ఆఫ్ స్పిన్‌, లెగ్ స్పిన్ బౌలింగ్ చేయగల సమర్థుడు కాబట్టి.. లివింగ్ స్టోన్ కు అంత డిమాండ్ ఏర్పడింది.

రెండ్రోజుల వేలంలో చూసుకుంటే.. ఇప్పటి వరకూ అత్యధిక రేటు పలికిన ఆటగాడు మన టీమిండియా ఆటగాడే కావడం విశేషం. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ను దక్కించుకునేందుకు రెండు జట్లు పోటీ పడ్డాయి. ముంబై ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ ల మధ్య ప్రధాన పోటీ ఉండగా.. ఎస్ఆర్ హెచ్ ఇషాన్ పై రూ.14 కోట్లు పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. ఆఖరికి ముంబై ఇండియన్స్ జట్టు ఇషాన్ కిషన్ ను రూ.15.25 కోట్లకు దక్కించుకుంది. తొలిరోజు జరిగిన వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఇషాన్ రికార్డు సృష్టించాడు.



Tags:    

Similar News