రషీద్ ఖాన్ సెన్సేషనల్ ఇన్నింగ్స్.. సన్ రైజర్స్ కు ఓటమి

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ ..

Update: 2022-04-28 03:24 GMT

ఐపీఎల్‌లో వరుస విజయాలతో దూసుకుపోతూ వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును గుజరాత్ టైటాన్స్ ఓడించింది. ఈ మ్యాచ్ లో విజయం ద్వారా 14 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానానికి చేరుకుంది. హైదరాబాద్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉమ్రాన్ మాలిక్ ఐదు వికెట్లు పడగొట్టినా కూడా మిగిలిన బౌలర్ల నుండి పెద్దగా సపోర్ట్ లేకపోవడం.. రషీద్ ఖాన్ ఆఖర్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో హైదరాబాద్‌ కు ఓటమి ఎదురైంది.

గుజరాత్ ఇన్నింగ్స్ లో తొలుత సాహా 38 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 68 పరుగులు చేస్తే, చివర్లో రాహుల్ తెవాటియా 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్ 11 బంతుల్లో 4 సిక్సర్లతో ఏకంగా 31 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి టైటాన్స్ విజయాన్ని అందుకుంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (42 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్కరమ్ (40 బంతుల్లో 2 పోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో శశాంక్ సింగ్ ఆరు బంతుల్లో ఫోర్, మూడు సిక్సర్లతో 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ పరాజయంతో హైదరాబాద్ మూడో స్థానానికి పడిపోయింది. 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌కు ఇది ఏడో విజయం. గుజరాత్ కోల్పోయిన 5 వికెట్లను ఉమ్రాన్ మాలిక్‌ తీశాడు. అతడికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ కేపిటల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.


Tags:    

Similar News