IPL 2023 : కోట్లు కురిపించే ఆట ఇది

నేటి నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభకానుంది. అట్టహాసంగా ప్రారంభమయ్యే ఈ సీజన్ అందరినీ అలరించడం ఖాయంగా కనిపిస్తుంది.

Update: 2023-03-31 03:13 GMT

నేటి సాయంత్రం నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభకానుంది. అట్టహాసంగా ప్రారంభమయ్యే ఈ సీజన్ అందరినీ అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక పోతే క్రికెట్ అంటే కాసుల వర్షమే. ఒక్కసారి టీం ఇండియాలోకి అడుగుపెడితే ఇక జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాసులు వాటంతట అవే వస్తాయి. కోట్ల రూపాయలు పెర్‌ఫార్మెన్స్ బట్టి ఇంటికే నడిచి వస్తాయి. కేవలం బీసీసీఐ ఇచ్చే మొత్తమే కాదు ప్రకటనల రూపంలోనూ ఆటగాళ్లకు పండగే పండగ. అయితే ఐపీఎల్ రాకతోనూ ఆటగాళ్లకు కాసుల వర్షం కురుస్తుంది.

మేలు రకం ఆటగాడిని...
మేలు రకం ఆటగాడిని కొనుగోలుచేసేందుకు ఏ ఫ్రాంఛేజెస్ వెనుకాడదు. వేలంపేటలోనే ఎగరేసుకుని పోయే అవకాశం ఐపీఎల్ మాత్రమే ఉంది. తర్వాత మైదానంలో ఆట తీరు ఎలా ఉన్నా సరే... ముందుగానే కోట్లు పోసి అగ్రిమెంట్ కుదుర్చుకుని తమ జట్టులోకి ఆటగాడిని చేర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో ఐపీఎల్ లో అత్యధికంగా మహేంద్ర సింగ్ థోని, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి కాస్ట్‌లీ ప్లేయర్లుగా ముద్రపడ్డారు. ముద్రపడటమే కాదు ఐపీఎల్ వారి సంపాదన కూడా ఎక్కువే. వారు ఉంటే జట్టుకు అదో ధైర్యం. గెలిచేశామంత మనో నిబ్బరం అందుకే వారిని మినిమం గ్యారంటీ ప్లేయర్లుగా ఎంచుకుని మరీ కోట్ల మొత్తాన్ని చెల్లించడానికి ఫ్రాంఛైజెస్ వెనుకాడవు.
టాప్ వన్ లో రోహిత్...
ఇప్పటి వరకూ పదిహేను సీజన్లు గడిచిపోయాయి. ఇది పదహారో సీజన్. ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ లో వీరి సంపాదన ఎంతో తెలుసా? వందల కోట్ల రూపాయలు. ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 178.60 కోట్ల రూపాయలు సంపాదించారు. సంపాదనలో రోహిత్ టాప్. తర్వాత స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ థోని. థోని ఇప్పటి వరకూ ఐపీఎల్ ద్వారా 176.84 కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు.
తర్వాత స్థానాల్లో....
ఆ తర్వాత స్థానంలో విరాట్ కొహ్లి ఉన్నారు. కొహ్లి ఐపీఎల్ ఆదాయం 173.20 కోట్ల రూపాయలట. ఆ తర్వాత సురేష్ రైనా నిలిచారు. రైనా కోసం ఇప్పటి వరకూ 110.74 కోట్ల రూపాయలు చెల్లించారు. రైనా తర్వాత స్థానం రవీంద్ర జడేజా దక్కించుకున్నారు. రవీంద్ర జడేజాకు 109.01 కోట్లతో టాప్ టెన్ ఆదాయం ఆర్జించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఆల్‌రౌండర్ కావడంతో అధిక మొత్తం చెల్లించి మరీ జట్టులోకి తీసుకున్నారు. ఇలా ఆటగాళ్ల ఆదాయం మామూలుగా లేదు. అందుకే ఐపీఎల్ లో ఆడి ప్రతిభను నిరూపించుకోవాలని ప్రతి క్రికెటర్ తహతహ లాడుతుంటారు. మైదానంలో వారి పనితీరును బట్టి రేటు కూడా ఉండటం, తర్వాత సీజన్ కు ఎంపిక చేసుకోవాలంటే అత్యుత్తమ ప్రతిభ కనపర్చాల్సి రావడంతో అందరూ శ్రమించి అందరినీ అలరిస్తుంటారన్నది కాదనలేని వాస్తవం.


Tags:    

Similar News