IPL 2024 : కోల్‌కత్తాకు తిరుగులేదు.. లక్నోకు ఓటమి తప్పలేదు

లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ పెద్దగా ఆసక్తి లేకుండానే సాగింది.

Update: 2024-04-14 13:30 GMT

లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ పెద్దగా ఆసక్తి లేకుండానే సాగింది. మళ్లీ లక్నో తక్కువ స్కోరుకు అవుటయింది. లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్ లో కొత్త జెర్సీతో మైదానంలో కనిపించింది. ఫుట్ బాల్ క్లబ్ కు ట్రిబ్యూట్ గా కొత్త జెర్సీతో మెరిసింది. అయితే తొలి ఓవర్లలో దూకుడుగా ఆడిన లక్నో తర్వాత వరసగా దెబ్బతినింది. ఓపెనర్ డీకాక్ ను కోల్్‌కత్తా నైట్ రైడర్స్ బౌలర్ వైభవ్ అవుట్ చేశాడు పది పరుగులుచేసిన డీకాక్ అవుట్ కావడంతో దీపక్ హుడా క్రీజ్ లోకి వచ్చాడు.

తక్కువ పరుగులకు ....
హుడా కూడా ఎనిమిది పరుగులు చేసి అవుటయ్యాడు. కేఎల్ రాహుల్, ఆయుష్ బదోని కలసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే 39 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ కూడా అవుట్ కావడంతో స్టాయినిస్ వచ్చి వెంటనే వెనుదిరిగాడు. బదోని కొంత నిలకడగా ఆడుతాడని భావిస్తే బదోని కూడా 29 పరుగులు చేసి అవుటయ్యాడు. పూరన్ దూకుడుగా ఆడటంతో కొంత స్కోరు పెరిగింది. ఏడు వికెట్లు కోల్పోయి లక్నో 161 పరుగులు చేసింది. పెద్ద స్కోరు కాదు.. కోల్‌కత్తా నైట్ రైడర్స్ కు ఇది సులువుగా ఛేదించే స్కోరు అని అందరికీ తెలిసిందే.
ఊదిపారేశారు....
162 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్్ఖత్తా నైట్ రైడర్స్ కూడా ఆదిలోనే ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు. నరేన్, రఘువంశ్ లు తక్కువ పరుగులు చేసి అవుటయ్యారు. తర్వాత శ్రే‍యస్ అయ్యర్, సాల్ట్ క్రీజులో ఉన్నారు. కొంత నిలకడగా ఆడుతున్నారు. ఫిల్ట్ సాల్ట్ తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా నిలదొక్కుకోవడంతో పది ఓవర్లకే కోల్‌కత్తా నైట్ రైడర్స్ విజయం ఖాయమయింది. సాల్ట్ 94 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 38 పరుగులు చేశాడు. దీంతో చివరకు షారూఖ్ ఖాన్ బ్యాచ్ దే విజయం అయింది. నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.


Tags:    

Similar News