IPL 2024 : ఫైనల్స్ కు వరణుడు సహకరిస్తాడా? వెదర్ రిపోర్ట్ ఏం చెబుతుందంటే?

ఐపీఎల్ లో ఈరోజు ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది

Update: 2024-05-26 02:42 GMT

ఐపీఎల్ లో ఈరోజు ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటకు ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు వాతావరణం మాత్రం ఇబ్బంది పెట్టేలా కనిపిస్తుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారడంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు తమిళనాడు ను కూడా చుట్టుముట్టనున్నాయని తెలిపింది. ః

వర్షం కురిసే అవకాశం...
భారీ వర్షాలు కురిస్తే ఈరోజు ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నది మాత్రం డిసైడ్ చేసి అంపైర్లు కాదు.. వరుణుడనే చెప్పాలి. ఎందుకంటే సాయంత్రానికి వర్షం కురవకపోతే మ్యాచ్ జరుగుతుంది. లేకుంటే లేదు. ఈసారి ఛాంపియన్ షిప్ సాధించేందుకు రెండు జట్లు బలంగా తలపడుతున్నాయి. నువ్వా? నేనా? అన్న రీతిలో ఆట సాగే అవకాశముండటంతో పాటు సండే కావడంతో ఎక్కువ మంది క్రికెట్ అభిమానులు ఈ చివరి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Tags:    

Similar News