IPL 2024 : నేడు ఐపీఎల్ ఫైనల్స్... ఎవరు ఛాంపియన్ అనేది మాత్రం

ఐపీఎల్ 17వ సీజన్ నేటితో ముగియనుంది. ఈరోజు ఫైనల్స్ లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది

Update: 2024-05-26 02:29 GMT

ఐపీఎల్ 17వ సీజన్ నేటితో ముగియనుంది. ఈరోజు ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటకు ప్రారంభమవుతుంది. ఈరోజు ఫైనల్స్ లో గెలిచి ఎవరు ఛాంపియన్ గా నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రెండు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. సమఉజ్జీలు తలపడితే పోరు ఎలా ఉంటుందో ఈరోజు క్రికెట్ ఫ్యాన్స్ ప్రత్యక్షంగా తిలకించే అవకాశం ఏర్పడింది.

సమఉజ్జీల మధ్య పోరు...
బౌలింగ్, బ్యాటింగ్ పరంగా రెండు జట్లు సమానంగానే కనిపిస్తున్నాయి. అయితే మైదానంలో ఎవరు పై చేయి సాధిస్తే వారిదే కప్పు అనేది వాస్తవం. అందుకే ఈ మ్యాచ్ లో గెలుపోటములు ఎవరు అంచనా వేయలేని పరిస్థితి. కోల్‌కత్తా నైట్ రైడర్స్ వరస విజయాలతో మంచి ఊపుమీద ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఓటమి పాలయినా ఫుల్లు కాన్ఫిడెన్స్ లో ఉంది. అందుకే ఈ మ్యాచ్ ఈరోజు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తుందని చెప్పక తప్పదు. రెండుజట్ల ఆటగాళ్లు ఐపీఎల్ ట్రోఫీతో చెన్నై బీచ్‌, ఆటోలో కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Tags:    

Similar News