IPL 2024 : ఐపీఎల్ కు దినేశ్ కార్తీక్ గుడ్ బై

ఐపీఎల్ కు దినేశ్ కార్తీక్ గుడ్ బై చెప్పేశారు. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

Update: 2024-05-23 04:23 GMT

IPL 2024 :ఐపీఎల్ కు దినేశ్ కార్తీక్ గుడ్ బై చెప్పేశారు. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించాడు. రాజస్థాన్ రాయల్స్ చేతులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలయిన తర్వాత తాను ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దినేశ్ కార్తీక్ వికెట్ కీపర్ గానే కాకుండా డెత్ ఓవర్లలో అత్యధిక పరగులు తెచ్చి జట్టుకు అనేకసార్లు విజయాలను అందించారు.

డెత్ ఓవర్లలో.....
వయసుతో సంబంధం లేకుండా ఫామ్ లో కొనసాగుతున్న దినేశ్ కార్తీక్ రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడంతో అభిమానులు కూడా కొంత నిరాశకు గురయ్యారు. దినేశ్ కార్తీక్ ఇప్పటి వరకూ ఐపీఎల్ లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్, గుజరాత్ లయన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్ లో పదిహేను మ్యాచ్ లు ఆడిన దినేశ్ కార్తీక్ 326 పరుగులు చేశాడు.


Tags:    

Similar News