Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ కంటిన్యూ... పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని కేంద్ర మంత్రులు ప్రకటించినట్లుగానే ఇంకా భారత్ పాకిస్తాన్ పై దాడులకు దిగింది.

Update: 2025-05-08 12:03 GMT

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని కేంద్ర మంత్రులు ప్రకటించినట్లుగానే ఇంకా భారత్ పాకిస్తాన్ పై దాడులకు దిగింది. పాక్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు నిర్వహిస్తుంది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ ప్రయత్నించింది. దీంతో పాక్ గగన తల రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని భారత్ ప్రతీకార దాడులకు దిగింది. లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవ్థను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. చైనా దేశానికి చెందిన హెచ్ క్యూ 9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్ సరిహద్దు రాష్ట్రాలపై దాడులకు దిగుతుంది.

క్షిపణులు.. డ్రోన్లతో...
క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. అమృత్ సర్, కపుర్తలా, జలంధర్, భుజ్, పలోడి. నాల్, చండీగఢ్, భఠిండా, ఆదామ్ పూర్, పటాన్ కోట్, జమ్మూ, శ్రీనగర్, అవంతిపురలోని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఆర్మీ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతుంది. అయితే ఈ దాడులను భారత్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. పాక్ దాడులు చేస్తుందన్న ఆధారాలను సేకరించడానికి వాటి శకలాలను కూడా అధికారులు సేకరించారు. పాక్ కవ్వింపు చర్యలకు దిగడంతో పాటు భారత్ పౌరులను లక్ష్యంగా చేసుకోవడం, సైనిక స్థావరాలపై దాడులకు దిగడంతో పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార దిడులకు దిగిందని చెబుతున్నారు.
సరిహద్దుల్లో హై అలెర్ట్...
అందువల్ల లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేయగలిగింది. ఇప్పటి వరకూ పాక్ దాడులకు పదహారు మంది వరకూ భారత్ పౌరులు మరణించారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా దేశ భద్రత తమకు ముఖ్యమని, దాడులకు ప్రతి దాడులు జరుగుతాయని హెచ్చరించారు. పాక్ లోని కీలక నగరాలపై భారత్ దాడులకు కు దిగింది. పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత్ ప్రతీకార దాడులకు దిగుతుంది. పాకిస్థాన్‌తో సరిహద్దులున్న రాజస్థాన్‌, పంజాబ్‌ సరిహద్దులు మూసిస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌, పంజాబ్‌ల‌లో హై అలర్ట్‌ ప్రకటించింది. పాక్‌తో రాజస్థాన్‌ 1037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు పూర్తిగా మూసివేసింది. సరిహద్దు రాష్ట్రాల్లో హై అలెర్ట్ జారీ చేసింది


Tags:    

Similar News