Pakistan :పాక్ అంత తేలిగ్గా లొంగలేదు.. పెద్ద ప్లానే వేసింది కానీ ఫెయిల్ అయిన తర్వాతనే?

పాకిస్తాన్ ఆపరేషన్ సిందూర్ తర్వాత పెద్ద ప్లాన్ వేసింది. భారత్ లో మతకల్లోలాను సృష్టించడానికి ప్రయత్నించింది

Update: 2025-05-20 02:52 GMT

పాకిస్తాన్ ఆపరేషన్ సిందూర్ తర్వాత పెద్ద ప్లాన్ వేసింది. భారత్ లో మతకల్లోలాను సృష్టించడానికి ప్రయత్నించింది. అందుకే అనేక ప్రార్థనాలయాలు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడేందుకు ప్రయత్నించింది. అయితే భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొనడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది. పాక్ ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రదాడులను ధ్వంసం చేయడంతో పాటు వంద మంది వరకూ టెర్రరిస్టు గ్యాంగ్ ను మట్టుబెట్టడంతో పాటుగా పాక్ వైమానిక స్థావరాలు, సైనిక స్థావరాలపై దాడులు జరగడంతో పాక్ కసితో రగిలిపోయింది. భారత్ పై కసి తీర్చుకోవాలని పెద్ద స్కెచ్ వేసింది. అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతోనే తోక ముడిచింది.

కసితో రగిలిపోయి...
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రతీకారంతో రగిలిపోయిన పాక్ పంజాబ్ లోని అమృత్ సర్ వద్ద గల స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్లు, మిసైల్స్ ను ప్రయోగించింది. స్వర్ణదేవాలయంపై దాడి చేస్తే పంజాబ్ లో అల్లర్లు చెలరేగడమే కాకుండా అది దేశ వ్యాప్తంగా విస్తరించి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని పాక్ అంచానా వేసింది. కానీ డ్రోన్లను, క్షిపణులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. ఈ విషాన్ని జీవోసీ జనరల్ మేనేజర్ కార్తీక్ సి శేషాద్రి మీడియాకు చెప్పారు. భారత ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా ఉండటంతో వాటిని సులువుగా తిప్పికొట్టగలగడంతో అతి ముఖ్యమైన సర్ణ దేవాలయాన్ని మన సైన్యం కాపాడుకోగలిగింది.
ముందుగానే పసిగట్టిన...
అయితే పాక్ కుతంత్రాలను, కుట్రలను ముందుగానే పసిగట్టిన భారత్ ఆర్మీ అందుకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండటమే కాకుండా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో ఆపగలిగింది. సర్ణ దేవాలయానికి పూర్తి రక్షణ కల్పించడమే కాకుండా పంజాబ్ ప్రాంతంలో ప్రత్యేకంగా బలగాలను మొహరించి సమర్థవంతంగా పాక్ దాడులు చేసినా వాటి వల్ల నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ ఈ నెల 8వ తేదీన మానవ రహిత వైమానిక దాడులకు కూడా ప్రయత్నించందని కార్తీక్ సి. శేషాద్రి చెప్పారు. ఆకాశ్ క్షిఫని వ్యవస్థతో పాటు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న భారత్ పాక్ దాడుల వల్ల భారత్ లో ఏపాటి చిన్న పాటి నష్టం కూడా జరగకుండా చూడగలిగింది. అన్నీ ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిసిన తర్వాతనే కాల్పుల విరమణ అంటూ పాక్ కాళ్ల బేరానికి వచ్చిందని చెప్పవచ్చు.


Tags:    

Similar News