బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మొదటి వీరుడు మంగళ్ పాండే

బ్రిటీషర్లు మొదట జంతువుల కొవ్వును ఉపయోగించలేదని చెప్పారు. కానీ అది కోవ్వేనని పాండే, ఇతర సైనికుల్లో సందేహాలు మరింత బలపడ్డాయి

Update: 2022-08-10 16:18 GMT

1857లోనే భారత్ కు బ్రిటీషర్స్ నుండి స్వాతంత్య్రం రావాల్సి ఉండాల్సిందని ఎంతో మంది చరిత్రకారులు చెబుతూ ఉంటాడు. సిపాయిల తిరుగుబాటుకు దారితీసిన సంఘటనలలో స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండే కీలక పాత్ర పోషించారు. ఆయన బ్రిటీష్ వారి గుండెల్లో తూటాలు దింపి.. స్వాతంత్య్రం సాధించే క్రమంలో ఆయన వీరమరణం పొందారు.


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫైజాబాద్ సమీపంలోని ఒక పట్టణంలో జూలై 19, 1827 జన్మించారు. పాండే 1849 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరారు. 34 వ బెంగాల్ స్థానిక పదాతిదళానికి చెందిన 6 వ కంపెనీలో ఆయన సైనికుడిగా (సిపాయి) చేశారు, ఇందులో పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు ఉన్నారు. తన వృత్తిని సిపాయిగా భవిష్యత్ విజయానికి ఒక మెట్టుగా భావించాడు. పాండే ఆశయాలు అతని మత విశ్వాసాలతో విభేదించాయి. అతను 1850 ల మధ్యలో బరాక్‌పూర్‌లోని దండు వద్ద పోస్ట్ చేయబడినప్పుడు, ఒక కొత్త ఎన్‌ఫీల్డ్ రైఫిల్‌ను భారతదేశంలోకి ప్రవేశపెట్టారు, ఆయుధాన్ని లోడ్ చేయడానికి ఒక సైనికుడు గ్రీజు గుళికల చివరలను కొరకాల్సి ఉంటుంది. దానికి ఆవు లేదా పంది పందికొవ్వు పూసి ఉంటారనే పుకారు వ్యాపించింది. దీంతో పాండే తన తోటి సిపాయిలను బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడడానికి ప్రేరేపించారు.

బ్రిటీషర్లు మొదట జంతువుల కొవ్వును ఉపయోగించలేదని చెప్పారు. కానీ అది కోవ్వేనని పాండే, ఇతర సైనికుల్లో సందేహాలు మరింత బలపడ్డాయి. చివరికి బ్రిటిష్ రాజ్యాధిపత్యంపై తిరుగుబాటుకు దారితీశాయి. పాండే తన తోటి సిపాయిలను బ్రిటీష్ సామ్రాజ్య పాలనలో జరిగే దురాగతాలపై కదం తొక్కాలని పిలుపునిచ్చారు. బ్రిటీషర్స్ అరాచకాలను మౌనంగా భరించిన భారతీయుల్లో మంగళ్ పాండే తిరుగుబాటుతో భారీ మార్పు వచ్చింది. మార్చి 29, 1857న ఉత్తర కోల్‌కతాలోని బరాక్‌పూర్‌లో మంగళ్ పాండే ఇద్దరు బ్రిటిష్ అధికారులపై దాడి చేశారు. ఈ సంఘటన తరువాత, పాండేపై విచారణ జరిగింది. ఆపై ఉరిశిక్షను విధించారు. విచారణ సందర్భంగా, తాను తన స్వేచ్ఛా సంకల్పంతో తిరుగుబాటు చేశానని, ఇతర సిపాయిల ప్రభావం తనపై లేదని కోర్టుకు తెలిపారు. బ్రిటీషర్స్ చేతిలో చావడం కంటే తనను తాను కాల్చుకోవడానికి ప్రయత్నించాడని కూడా కొందరు చెబుతూ ఉంటారు.

స్థానిక తలారులు మంగళ్ పాండేను ఉరి తీయడానికి రాకపోవడంతో అధికారులు కోల్‌కతాకు చెందిన నలుగురు తలారులను పిలిపించి 1857 ఏప్రిల్ 8న ఉరి తీశారు. మంగళ్ పాండే మరణించినా ఆయన రగిలించిన తిరుగుబాటు వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా స్వాతంత్రోద్యమం ప్రజ్వరిల్లింది. మంగళ్ పాండే ప్రారంభించిన తిరుగుబాటును 1857 సిపాయిల తిరుగుబాటు అని, మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు.


Tags:    

Similar News