భారత్‌తో పాటు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొనే 3 దేశాలు ఇవే

భారత్‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో కేంద్రం గత సంవత్సరం నుంచి హర్ ఘర్ తిరంగ..

Update: 2023-08-11 06:33 GMT

భారత్‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో కేంద్రం గత సంవత్సరం నుంచి హర్ ఘర్ తిరంగ పేరుతో భారీ ప్రచారం చేపట్టింది. దేశ ప్రజలందరూ తమ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచిస్తోంది. ఇందు కోసం పోస్టాఫీసుల్లో తక్కువ ధరల్లో అంటే కేవలం 25 రూపాయలకే ఆర్డర్‌ చేసుకునే సదుపాయం తీసుకువచ్చింది. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగువేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు యావత్ దేశ ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మరోవైపు మన దాయాది దేశం పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటోంది. అయితే, మనతో పాటు అంటే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే దేశాలు నాలుగు ఉన్నాయి. మరి ఆ దేశాలు ఏవేవో చూద్దాం.

  1. లిచెన్‌స్టెయిన్ ఒక దేశం. ఇది ప్రపంచంలోని చిన్న దేశాలలో ఒకటిగా చెప్పవచ్చు. అయితే ఈ దేశం కూడా 1866 ఆగస్టు 15న జర్మనీ నుంచి స్వాతంత్రం పొందింది. 1940 సంవత్సరం నుంచి ఇక్కడ స్వాతంత్ర్య దినోత్సవం ఆగష్టు 15 న జరుపుకుంటారు.
  2. దక్షిణ కొరియా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. 1945 ఆగస్టు 15న జపాన్ నుంచి దక్షిణ కొరియా స్వాతంత్ర్యం పొందింది. యుఎస్, సోవియట్ దళాలు జపాన్ ఆక్రమణ నుంచి కొరియాను విముక్తి చేశాయి. దక్షిణ కొరియాలో, ఆగస్టు 15న జాతీయ సెలవుదినం కూడా పాటిస్తోంది.
  3. దక్షిణ కొరియా మాదిరిగానే ఉత్తర కొరియా కూడా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. 1945లో జపాన్ ఆక్రమించుకున్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని రెండు దేశాలు జరుపుకుంటాయి. రెండు దేశాలు 1945 ఆగస్టు 15న జపాన్ ఆక్రమణ నుంచి విముక్తి పొందాయి. ఉత్తర కొరియా ఆగస్టు 15ని జాతీయ సెలవుదినంగా జరుపుకుంటుంది.
Tags:    

Similar News